తెలంగాణ

Khammam: కుక్కల స్వైర విహారం.. 8 మందిపై దాడి చేసిన కుక్కలు

ఖమ్మం జిల్లా ముజ్జుగూడెంలో వీధి కుక్కల స్వైరవిహారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బారులు తీరుతున్న కుక్కలు పాదచారులు పిల్లలపై దాడులు చేస్తుండటంతో బయటకు రావడానికి ప్రజలు భయపడుతున్నారు. 8 మందిపై కుక్కలు దాడి చేశాయి. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతోందనివెంటనే చర్యలు చేపట్టి కుక్కల నియంత్రణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button