తెలంగాణ
అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నబాలికపై కుక్క దాడి

కామారెడ్డి జిల్లా సోమారంపేట తండాలో కుక్కుల స్వైరవిహారం చేశాయి. అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్నబాలికపై కుక్క దాడి చేసింది. కుక్క దాడిలో బాలిక ముఖం, నోరు భాగంలో గాయాలయ్యయి. స్థానికులు బాలికను సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. బాలికకు మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. గ్రామంలో వీధి కుక్కల సమస్యపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



