తెలంగాణ
Hyderabad: రవీంద్ర భారతిలో దొడ్డి కోమరయ్య జయంతి వేడుకలు

Hyderabad: హైదరాబాద్ రవీంద్ర భారతిలో దొడ్డి కోమరయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రోఫెసర్ కంచె ఐలయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. వరంగల్ నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కోమరయ్య పేరును పెట్టాలని కంచె ఐలయ్య డిమాండ్ చేశారు.
విమానాశ్రాయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదనను ఆయన తప్పుబట్టారు. రాజులు, రాణుల కాలం చెల్లిందన్నారు. తెలంగాణ అస్తిత్వానికి తొలి అమరుడు కోమరయ్య పేరు పెడితే ఆయన ఖ్యాతి ప్రపంచానికి తెలుస్తుందన్నారు.



