జాతియం
DK Shivakumar: రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్న డీకే శివకుమార్

DK Shivakumar: కర్నూల జిల్లాలోని మంత్రాలయాన్ని సతీసమేతంగా సందర్శించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మంచాలమ్మ దేవి దర్శనం అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నారు డీకే శివకుమార్. అనంతరం శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజిని కలిసి మఠం గురించి తెలుసుకున్నారు.
ఇక మంత్రాలయాన్ని సందర్శించిన డీకే దంపతులను శ్రీ మఠం సభ్యులు ఘనంగా సత్కరించారు. డీకే దంపతులతోపాటు రాఘవేంద్ర స్వామివారిని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి కూడా దర్శించుకుని పీఠాధిపతి సుబుధేంద్ర స్వామీ ఆశీస్సులు తీసుకున్నారు.



