Telangana: కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు

Telangana: తెలంగాణలో పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14 న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు.తద్వారా 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరనుంది.
గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసింది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94లక్షల 72వేల 422 కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అయితే గతంలో ప్రకటించినట్లు స్మార్ట్ కార్డులు అందజేస్తారా? లేక నార్మల్ కార్డులు అందజేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావలసి ఉంది.