సినిమా
Ram Gopal Varma: నేడు ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు డైరెక్టర్ వర్మ

Ram Gopal Varma: వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. కాసేపట్లో ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌కు చేరుకోనున్నారు. ఒంగోలు రూరల్ పీఎస్‌లోనే ఆయనను విచారించనున్నారు. అందుకు సంబంధించి పోలీసులు ఏర్పాట్లు చేశారు.
గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆర్జీవీ పోస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబరు 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా వర్మ పోలీసుల ముందుకు రానున్నారు.