సినిమా

8 Vasantalu: ఓటీటీలోకి ‘8 వసంతాలు’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

8 Vasantalu: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘ఎనిమిది వసంతాలు’ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. అనంతిక సనీల్‌కుమార్, రవి దుగ్గిరాల నటించిన ఈ సినిమాకి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు.

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎనిమిది వసంతాలు’ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కానీ కమర్శియల్ గా డిజాస్టర్ అయ్యింది. అనంతిక సనీల్‌కుమార్, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక యువతి జీవితంలోని ఎనిమిది సంవత్సరాల ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుంది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 20న విడుదలై, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హను రెడ్డి, కన్నా పసునూరి లాంటి నటులు మరిన్ని కీలక పాత్రల్లో మెరిశారు. మరి థియేటర్లలో నిరాశ పరిచిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button