ఆంధ్ర ప్రదేశ్
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభం

Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభంయ్యాయి. ఈ పనులను సంబంధిత కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. 1.396 కిలోమీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రణాళికలు రూపొందించారు.
1.5 మీటర్ల మందంతో నది ప్రవాహ మార్గంలో భూమి లోపల దీనిని నిర్మించనున్నారు. పాత డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది.