ధురంధర్.. 2025 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్!

Dhurandhar: 2025 సంవత్సరం భారతీయ సినిమా పరిశ్రమకు అద్భుతమైన విజయాలను అందించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ నిలిచింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల మార్కును దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
రణవీర్ సింగ్ కెరీర్‌లో ఇది అతిపెద్ద విజయంగా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ధురంధర్ స్పై థ్రిల్లర్ జోనర్‌లో అద్భుతమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, హై ఆక్టాక్టాన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించాయి. 1200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 2025 బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో బాలీవుడ్ సత్తా మరోసారి నిరూపితమైంది.



