Dhanya Balakrishna: అవకాశాల్లేవ్.. ధన్య ఎమోషనల్?

Dhanya Balakrishna: యువ నటి ధన్య బాలకృష్ణ తన కెరీర్‌లో విజయం సాధించలేకపోవడానికి తానే కారణమని ఒప్పుకుంది. గ్లామర్ రోల్స్ చేయడానికి నిరాకరించడం వల్ల మంచి అవకాశాలు కోల్పోయానని వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘సెవెన్త్ సెన్స్’,’లవ్ ఫెయిల్యూర్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది’, ‘నేను శైలజా’, ‘భలే మంచి రోజు’, ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ధన్య బాలకృష్ణ ‘కృష్ణ లీల’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గ్లామర్, బోల్డ్ సన్నివేశాలు చేయకపోవడం వల్ల పలు మంచి అవకాశాలు చేజారిపోయాయని ఆమె అంగీకరించింది.
మొదట్లో ఈ విషయం నిరాశ కలిగించినా, తర్వాత తన నిర్ణయాలే తన భవిష్యత్తును నిర్దేశించాయని పేర్కొంది. ఫ్యామిలీ నేపథ్యం కూడా తన కెరీర్‌కు అడ్డంకిగా నిలిచిందని బాధపడింది. గ్లామర్‌కు ప్రాధాన్యత ఇచ్చే నిర్మాతలు ఉన్నంత వరకు ప్రతిభావంతులైన హీరోయిన్లకు అవకాశాలు రావడం కష్టమని ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.



