Basara: బాసరలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

Basara: నిర్మల్ జిల్లా బాసర శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9రోజుల అలంకరణలో ఈ రోజు మొదటి రోజు అమ్మవారు భక్తులకు శైల పుత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ అర్చక వైదిక బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కట్టే పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ అంజనీదేవి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు.
వ్యాస ముని తపస్సుకు మెచ్చిన జగన్మాత…
సరస్వతీమాత విద్య, జ్ఞానానికి ప్రతిరూపం. దేశంలోనే ప్రసిద్ధి చెందిన సరస్వతి అమ్మవారి ఆలయం బాసరలో ఉంది. వ్యాసమహర్షి తపస్సుకు జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని కోరింది. మహర్షి గోదావరి నదిలోంచి 3గుప్పెళ్ల ఇసుక తీసుకొచ్చి సరస్వతి, లక్ష్మి, మహాకాళి మూర్తులను ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఈప్రాంతం వ్యాసపురి, వాసరగా ప్రసిద్ధి చెంది, కాలక్రమేనా బాసరగా మారింది. చాళుక్య రాజులు గుడి కట్టారు.
బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సరస్వతి అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రత్యేక విశేష అర్చన పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కట్టెపొంగలిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులతో అమ్మవారి ఆలయం కిటకిటలాడుతోంది.



