సినిమా

Devara: జపాన్ గడ్డపై దేవర వేట మొదలు

Devara: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాను జపాన్ లో గ్రాండ్ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తారక్ తన భార్య ప్రణతి తో కలిసి జపాన్ వెళ్ళాడు. ఇప్పుడు అక్కడికే వెళ్లి మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తారక్ ప్రారంభించారు.

ఈ నెల 28న జపాన్‌లో విడుదల కానున్న ‘దేవర’ అక్కడ మంచి ఓపెనింగ్స్ నమోదు చేయడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది కేవలం ఓ రిలీజ్ మాత్రమే కాదు, RRR తరువాత జపాన్ మార్కెట్‌లో తన స్థాయిని మరోసారి స్థిరపరిచే అవకాశంగా తారక్ భావిస్తున్నాడు.

దీనివల్ల దేవర పార్ట్ 2 బజ్ పెరగడం కూడా ఖాయం.ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన జపాన్ వెర్షన్ టీజర్ కి, ప్రమోషన్స్ కి మంచి టాక్ రావడంతో, అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. మరి దేవరోడు జపాన్ లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button