ట్రాక్‌లోకి దేవర 2?

Devara 2 : ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్‌పై మళ్లీ ఆసక్తి పుట్టింది. కొరటాల శివ కొత్త స్క్రిప్ట్ వెర్షన్ తారక్‌కు నచ్చింది. గతంలో సీక్వెల్ లేదనే టాక్ వినిపించింది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఆగమనం గ్యారెంటీ అన్నట్టు చర్చ నడుస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ మంచి విజయం సాధించింది. సీక్వెల్ పై అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కొంతకాలం క్రితం సీక్వెల్ రాదనే టాక్ బలంగా వినిపించింది. మధ్యలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇప్పుడు సమీకరణాలు మారాయి. కొరటాల శివ కొత్తగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ వెర్షన్ ఎన్టీఆర్‌కు బాగా నచ్చినట్టు సమాచారం.
దీంతో ‘దేవర 2’ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చినట్టు కొత్త ట్విస్ట్ వినిపిస్తోంది. పరిశ్రమ వర్గాల్లో ఈ చిత్రం ఖచ్చితంగా వస్తుందనే చర్చ నడుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది అధికారిక ప్రకటన రావాలి. అధికారిక అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది. అభిమానులు ఈ రూమర్స్‌తో ఆనందంలో మునిగిపోతున్నారు.



