సినిమా
Mark Shankar: కోలుకుంటున్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు

Mark Shankar: సింగపూర్ అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. వైద్యుల పర్యవేక్షణలో మరో మూడు రోజుల పాటు మార్క్ శంకర్ కు చికిత్స అందించనున్నారు. మార్క్ శంకర్ రెండురోజుల క్రితం సింగపూర్ లోని ఓ తరగతి గదిలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో చికిత్స అందిస్తున్నారు.