తెలంగాణ
సికింద్రాబాద్లో కూల్చివేతల కలకలం

సికింద్రాబాద్లో కూల్చివేతలు కలకలం రేపాయి. రక్షణ శాఖ భూముల్లోని అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ అధికారులు నేలమట్టం చేశారు. పికెట్ ఎరుకల బస్తీలో భవనాలను కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు.
కంటోన్మెంట్ అధికారుల తీరుపై భవన యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు మాత్రం తాము గతంలోనే నోటీసులు జారీ చేశామంటున్నారు.



