ఆంధ్ర ప్రదేశ్
Visakhapatnam: బాలికపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

Visakhapatnam: బాలికపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేగింది. విశాఖ 3టౌన్ పీఎస్ పరిధిలోని వినాయక్ నగర్‌లో ఘటన వెలుగులోకి వచ్చింది. పదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.