జాతియం
ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. రౌండ్ రౌండ్‌కీ మారుతున్న ఆధిక్యాలు

Delhi Election Results 2025: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రౌండ్ రౌండ్‌కీ అభ్యర్థుల ఆధిక్యాలు మారుతున్నాయి. ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య పోటీ నెలకొన్నప్పటికీ.. 25 నియోజకవర్గాల్లో ఫలి తాలు తారుమారయ్యే అవకాశం కన్పిస్తోంది. ఇండియా కూటమి ఓట్ల చీలికతో బీజేపీ లాభం చేకూరుతుందోని విశ్లేషకులు చెబుతున్నారు.
సుమారు 10 సీట్లలో రెండు పార్టీల మధ్య వెయ్యి ఓట్ల తేడా కన్పిస్తోండగా.. 14 సీట్లలో రెండుపార్టీ మధ్య 3వేల ఓట్ల తేడా ఉంది. మొత్తం 24 నియోజకవర్గాల్లో వందల ఓట్ల తేడాతోనే అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.