తెలంగాణ

Hyderabad: అత్తాపూర్‌లో జింక మాంసం కలకలం.. నిందితుడి అరెస్ట్

Hyderabad:హైదరాబాద్ జిల్లా అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం రేపింది. సులేమాన్ నగర్లో జింక మాంసం అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను రాజేంద్ర నగర్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 15 కిలోల జింక మాంసం, జింక తోలు, తలతో పాటు 3 వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

నల్లమల అటవీ ప్రాంతంలో వేటాడి వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్కు జింకలను తీసుకువచ్చి, స్థానికంగా వధించి కిలో 800 రూపాయల చొప్పున నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజేంద్ర నగర్ SOT పోలీసులు నిందితుడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button