యువతకు దీపికా గోల్డెన్ ఛాన్స్!

Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తన 40వ పుట్టినరోజు సందర్భంగా ఆన్సెట్ ప్రోగ్రామ్ ప్రకటించింది. సినీ రంగంలో టాలెంట్ ఉన్న యువతకు శిక్షణ, అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో అన్ని విభాగాల్లో ట్రైనింగ్ ఇస్తారట. ఇది యూత్‌కు బంపర్ ఆఫర్‌గా మారింది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకొణె తన 40వ పుట్టినరోజు సందర్భంగా ఆన్సెట్ ప్రోగ్రామ్ అనే కొత్త వేదికను ప్రారంభించింది. సినీ రంగంలోకి రావాలని కలలు కనే యువతకు ఇది గోల్డెన్ అవకాశం. రైటింగ్, డైరెక్షన్, కెమెరా, మేకప్, కాస్ట్యూమ్స్ వంటి అన్ని విభాగాల్లో టాలెంట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
గతేడాది నుండి ఈ ఆలోచన ఉందని, ఇప్పుడు నిజం చేస్తున్నానని దీపికా వీడియో ద్వారా తెలిపింది. దేశవ్యాప్తంగా యంగ్ టాలెంట్‌ను గుర్తించి శిక్షణ ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపింది. ఆసక్తి ఉన్నవారు onsetprogram.in వెబ్సైట్లో వివరాలు, శాంపిల్స్ అప్లోడ్ చేయాలి. ఎంపికైనవారు ఇండస్ట్రీలోని పెద్ద టెక్నీషియన్లతో కలిసి పని చేసే అవకాశం పొందుతారు. నటనతోపాటు ప్రొడక్షన్, కెమెరా వంటి విభాగాల్లోనూ ట్రైనింగ్ లభిస్తుంది. టాలెంట్ ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.



