తెలంగాణ
Sigachi Industries: సిగాచి ప్రమాద ఘటన.. 40కి చేరిన మృతులు

Sigachi Industries: పాశమైలారం ప్రమాదంలో అంతకంతకు మృతులు పెరుగుతున్నారు. సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చని పోయారు. మృతుడు మున్మున్ చౌధురిగా గుర్తించారు. మరోవైపు ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఆరో రోజు కూడా ఎస్‌డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తుంది. అటు ప్రమాదం జరిగి ఆరు రోజులు అవుతున్నా ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించడం లేదు. మరోవైపు పటాన్‌చెరు ఆస్పత్రిలో ఐదు గుర్తు తెలియని మృతదేహాలు ఉన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 23మంది కార్మికులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.