కల్తీకల్లు ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య

హైదరాబాద్ కూకట్‌పల్లి కల్తీకల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 11కి పెరిగింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందు తూ మహిళ గంగామణి మృతిచెందింది. మరోవైపు కల్తీకల్లు కేసు దర్యాప్తును అధికారులు మరింత వేగవంతం చేశారు. కల్లులో అల్ఫ్రాజోలం, మత్తు ట్యాబ్లెట్లతో పాటు మురికి నీళ్లు కలిపి నట్టు గుర్తించారు. అధికారులకు ఈ నివేదిక అందించారు. కాగా.. ఇదే ఘటనలో మరికొంత మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కల్తీకల్లు కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. బాలానగర్ ఎక్సైజ్ పీఎస్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి, KPHB పీఎస్‌లలో మూడు కేసులు నమోదయ్యాయి.
మరోవైపు.. కల్తీ కల్లు ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. కల్తీ కల్లు మృతుల బంధువుల తరఫున HRCలో హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేసారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల పరిహారం, తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5లక్షల పరిహారం ఇవ్వాలని రామారావు పిటిషన్‌లో కోరారు.