తెలంగాణ
Khammam: డ్రైవర్ తో సహా వాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్

Khammam: ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయింది. వ్యాన్ కొట్టుకుపోయేముందు డ్రైవర్ డీసీఎం నుంచి దిగినట్లు సమాచారం. అయితే డ్రైవర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన డ్రైవర్ కోసం గాలింపు జరుగుతోంది. డ్రైవర్ వివరాలు తెలియాల్సి ఉంది.



