తెలంగాణ
Hyderabad: ఆర్టీసీ బస్సును ఢీకొన్న డీసీఎం వ్యాన్

Hyderabad: హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.



