News
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎంకి అసెంబ్లీలో అల్లు అర్జున్ వివాదంపై మాట్లాడటానికి సమయం ఉంది కానీ.. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడే సమయం లేదని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన.. అధికారం రాగానే.. పట్టించుకోకుండా మోసం చేస్తోందని విమర్శించారు.