తెలంగాణ
హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ సూసైడ్

హైదరాబాద్ మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ డ్యాన్స్ మాస్టర్ సూసైడ్ చేసుకున్నాడు. మియాపూర్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేగింది. డెలాయిట్ డ్యాన్స్ స్టూడియోలో రెండు నెలలుగా డ్యాన్స్ మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు యజమాని పరమేశ్. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాయికుమార్‌గా గుర్తించారు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.