తెలంగాణ
Danam Nagender: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్ చల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చింతల్ బస్తీలో హల్చల్ చేశారు. షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. అయితే తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైరయ్యారు.
ఎక్కడి నుంచో బ్రతకడానికి వచ్చిన వాళ్లు తమపై తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దావోస్ నుంచి సీఎం రేవంత్ వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని ఎమ్మెల్యే సూచించారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.