తెలంగాణ

Danam Nagender: సీఎం రేవంత్‌పై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్

Danam Nagender: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏక వచనంతో మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే , ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button