తెలంగాణ
Danam Nagender: చైనా మాంజ పట్టిస్తే రూ.5వేలు గిఫ్ట్ ఇస్తాం

Danam Nagender: చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించేలేదని హెచ్చరించారు.
ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని.వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.



