ఆంధ్ర ప్రదేశ్
Daggubati Purandeswari: రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది

Daggubati Purandeswari: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. ఈ వేడుకలకు విచ్చేసిన ఆమెకు మంత్రి కందుల దుర్గేష్ స్వాగతం పలికారు. అనంతరం నిడదవోలు మున్సిపాలిటీకి స్పెషల్ గ్రేడ్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వేదికపై ఆవిష్కరించారు.
నిడదవోలు వజ్రోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయని ప్రశంసించారు పురంధేశ్వరి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సక్రమంగా నెరవేరుస్తోందన్నారు.



