ఆంధ్ర ప్రదేశ్
Cyclone Montha: తీరం దాటిన ‘మొంథా’ తుఫాన్

Cyclone Montha: ఏపీని గజగజలాడించిన మొంథా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి పదకొండున్నర నుంచి పన్నెండున్నర మధ్యలో మొంథా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణశాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్ గానే కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది.
మొంథా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్ దగ్గర మరింత బలహీన పడనుంది. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలో మీటర్ల నుంచి 95 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.



