తెలంగాణ
భద్రాచలం రామయ్యను దర్శించుకున్న సీవీ ఆనంద్

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్. భద్రాచలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు భోగాల శ్రీనివాస రెడ్డి కుమార్తెతో సీవీ ఆనంద్ కుమారుడి వివాహం జరగనుంది.
ఈ నేపథ్యంలోనే భద్రాచలానికి వచ్చిన ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి లడ్డు ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు ఆలయ అధికారులు.



