Custard Apple: ఈ సీజన్‌లో సీతాఫలం తింటే ఎన్నో లాభాలు… అవేంటంటే..

Custard Apple: సీజన్‌లో లభించే పండ్లలో సీతాఫలం ప్రధానమైంది. చలి కాలం ప్రారంభం కాగానే లభించే సీతాఫలంతో ఎన్నో లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మిగతా సీజన్స్‌లో కాకుండా కేవలం కొంతకాలమే లభించే ఈ పండ్లను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ సీతాఫలం తీసుకోవడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సీతాఫలంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అతిసారం వంటి జీర్ణ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. ఈ పండులోని ఫ్యాటీ యాసిడ్స్ జీర్ణాశయాన్ని మంట వంటి వ్యాధుల నుంచి కాపాడి శరీరానికి శక్తిని అందిస్తాయి.
ఈ పండులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అవి రక్త నాళాలలో ఉంటాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
సీతాఫంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది. శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని అందించడంలో ఇవి ఉపయోగపడుతాయి.
గుండె ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా చూడడంలో సీతాఫలం ఉపయోగపడుతుంది. సీతాఫలం పండు అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా పక్షవాతం వంటి వ్యాధులను కూడా నివారిస్తుంది. శరీరానికి అవసరమైన వివిధ రకాల పోషకాలు సీతాఫలం పండులో ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రకరకాల ప్రయోజనాలను అందిస్తాయి.