తెలంగాణ
Nowhera Shaik: నౌహీరా షేక్ ఆస్తుల వేలం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ

Nowhera Shaik: ప్రముఖ పారిశ్రామికవేత్త నౌహీరా షేక్ కు సంబంధించిన ఆస్తులను ఈడీ వేలం వేస్తోంది. ఈ నేపథ్యంలోనే వేలంలో పాల్గొన్న వారికి నౌహీరా షేక్ బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
నౌహీరా షేక్ ఈడీ ఎదుట హాజరుకావాలని.. లేని ఎడల ఆమెను అరెస్ట్ చేయాలని స్పస్టం చేసింది సుప్రీంకోర్టు. కాగా, సబ్ రిజిస్టర్ సహాయంతో నౌహీరా షేక్ ఆస్తులను అమ్మేసినట్లు గుర్తించి ఈడీ ఆమె ఆస్తులను వేలం వేసింది.



