తెలంగాణ
నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

నేడు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. మరో రెండున్నర నెలల్లో ప్రస్తుత పాలక వర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. 45 ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. కౌన్సిల్ మీటింగ్‌కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. గడిచిన ఐదేండ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్‌లో చర్చ జరగనుంది.



