సినిమా

‘ఓజీ’ నుంచి క్రేజీ అప్‌డేట్.. కీలక పాత్రలో మరో క్రేజీ హీరోయిన్?

పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఓజీ’ నుంచి సంచలన అప్‌డేట్! ఓ కీలక పాత్రలో మరో క్రేజీ నటి ఎంట్రీ ఇస్తోందన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆమెవరో చూద్దాం.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లైనప్‌లో ఉన్న అరడజను చిత్రాల్లో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమాలో నటి సిరి లేళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

నారా రోహిత్‌తో నిశ్చితార్థం జరిగిన సిరి, ‘ప్రతినిధి-2’లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల నారా రోహిత్ తండ్రి మరణంతో వీరి వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘ఓజీ’లో సిరి లేళ్ళ నటనపై అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button