సినిమా

Pawan Kalyan: హరిహర వీరమల్లు నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్! హరిహర వీరమల్లు సినిమా నుంచి తాజా అప్‌డేట్ వచ్చేసింది. మరి, ఈ సినిమా గురించి లేటెస్ట్ బజ్ ఏంటో చూద్దాం!

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా రీ-రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్‌ఎక్స్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. దర్శకుడు జ్యోతికృష్ణ గత ఏడు నెలలుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ సినిమాను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. విజువల్స్, పాటలు, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మే 9 రిలీజ్ డేట్‌ను మేకర్స్ మరోసారి కన్ఫర్మ్ చేశారు. అయితే, పవన్‌పై చిత్రీకరించాల్సిన నాలుగు రోజుల షూటింగ్‌కు సంబంధించి డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింగపూర్ నుంచి పవన్ తిరిగొచ్చిన వెంటనే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమాతో పవన్ ఫ్యాన్స్‌కు మరో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమని టాక్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button