సినిమా

మెగాస్టార్‌ అనిల్ రావిపూడి మూవీ నుంచి క్రేజీ న్యూస్?

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ముఖ్యంగా సినిమాలో చిరు కామెడీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌లో క్లైమాక్స్‌ కోసం భారీ సెట్‌ నిర్మిస్తున్నారు. చిరంజీవి, నయనతారతో పాటు కీలక నటీనటులు ఈ సన్నివేశాల్లో పాల్గొంటారు.

వచ్చే వారం షూటింగ్‌లో చిరు, నయనతార మధ్య ఫ్యామిలీ సీన్స్‌తో కూడిన హాస్య ఎపిసోడ్‌ చిత్రీకరణ జరగనుంది. ఈ ఎపిసోడ్‌ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని టాక్‌. అనిల్‌ మార్క్‌ కామెడీ, చిరు హీరోయిజంతో ఈ చిత్రం మరో బ్లాక్‌బస్టర్‌గా రూపొందుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button