ఆంధ్ర ప్రదేశ్

CPI Narayana: జగన్ ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలి

CPI Narayana: వైసీపీ అధినేత జగన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైరయ్యారు. అసెంబ్లీకి వెళ్లకపోతే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని పదవిలో జగన్ కొనసాగకూడదన్నారు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలన్నారు. జగన్ చేష్టలు చాక్లెట్ కోసం చిన్న పిల్లలు కొట్టుకున్నట్లుందన్నారు.

జనం ఘోరంగా ఓడిస్తే జగన్ ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడని ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నిజం కాదా అన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన వారందరూ ఇంకా బయట తిరుగుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయడం లేదు వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలి పెట్టొద్దన్నారు. అందరినీ జైలుకు పంపండి అని సీపీఐ నారాయణ కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button