CPI Narayana: బిగ్ బాస్, అందాల పోటీలు స్త్రీ జాతికి కళంకం తెస్తాయి

CPI Narayana: బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం తెస్తాయని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలి అందాల పోటీలను రద్దు చేయాలన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిగ్ బాస్ కు మొదటి నుంచి మేము వ్యతిరేకమన్నారు. సమాజానికి ఉపయోగపడని షో బిగ్ బాస్ అన్నారు. మంచి వయసులో ఉన్న యువతి యువకులను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పడేస్తే ప్రకృతి రీ యాక్షన్స్ కు లోనవుతారన్న ఆయన అదే సమయంలో తప్పు చేస్తారని తెలిపారు.
అయితే, బిగ్ బాస్ పేరుతో జరుగుతోన్న చెడు సంస్కృతికి మేం వ్యతిరేకం అని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే కార్యక్రమంగా బిగ్ బాస్ ను పరిగణనలోకి తీసుకొని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అందాల పోటీ అంటే ఆడవాళ్లను అంగడి సరుకుగా మార్చినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ బాస్, అందాల పోటీలు రెండూ ఒక్కటే అన్నారు. అందాల పోటీ వల్ల టూరిజం ఎందుకు పెరుగుతుంది..? డబ్బు నష్టం తప్పా..? అని ప్రశ్నించారు.