CP Sajjanar: ఐబొమ్మ పైరసీ కేసు.. సీపీ సజ్జనార్ ఆశ్చర్యకర వివరాలు!

CP Sajjanar: ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు అనంతరం సీపీ సజ్జనార్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. 21 వేల సినిమాలు, రూ.20 కోట్ల సంపాదన, 50 లక్షల మంది డేటా దొరికాయి. టాలీవుడ్ పెద్దలు భేటీ అయ్యారు.
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు హైదరాబాద్ సీపీ సజ్జనార్ భేటీ అయ్యారు. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో భేటీ జరిగింది. సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ పైరసీ నష్టాలను వివరించారు. రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద 4 కేసులు నమోదయ్యాయి. శివరాజ్, ప్రశాంత్ అనే వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. రవి పైరసీతోపాటు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడు.
దాంతో అమాయకులు చనిపోయారు. ఒక సైట్ బ్లాక్ చేస్తే కొత్తది క్రియేట్ చేసేవాడు. అలా 65 మిర్రర్ సైట్లు నిర్వహించాడు. హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు దొరికాయి. 1972 గాడ్‌ఫాదర్ నుంచి 2025 ఓజీ వరకు ఉన్నాయి. ఇలా రూ.20 కోట్లు సంపాదించాడు. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది. ఇంత డేటా ప్రమాదకరమని సజ్జనార్ హెచ్చరించారు.



