జాతియం
ఢిల్లీ కోర్టులో సోనియాగాంధీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఢిల్లీ రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత పౌరసత్వం పొందటానికి మూడేళ్ల ముందే సోనియా గాంధీ ఓటు హక్కు పొందారని నకిలీ పత్రాల ద్వారా ఓటు హక్కు పొందిన ఆమెపై కేసు నమోదు చేయాలని దాఖలైన పిటిషన్‌కు సమాధానం చెప్పాలని కోర్టు ఆమెకు సమన్లు పంపింది. ఇదే కేసులో సోనియా గాంధీతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసిన కోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 6కి వాయిదా వేసింది.



