సినిమా

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు కోర్టు ఊరట!

Jacqueline Fernandez: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరట కల్పించింది. ఆమెపై ఉన్న ఆరోపణలను కోర్టు కొట్టివేసింది.

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. మనీ లాండరింగ్‌ కేసులో సుఖేష్‌ చంద్రశేఖర్‌తో సంబంధం ఆధారంగా ఆమెను ఈడీ విచారించింది. సుఖేష్‌ నుంచి వచ్చిన ఖరీదైన బహుమానాలు తీసుకున్నప్పటికీ, అవి నేర సొమ్ముతో వచ్చినవని తనకు తెలియదని జాక్వెలిన్‌ వాదించింది. సుఖేష్‌ ఆర్థిక కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని, కేవలం పరిచయం మాత్రమే ఉందని ఆమె కోర్టుకు వివరించింది.

ఈడీ ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేకపోవడంతో జాక్వెలిన్‌ వాదనలను కోర్టు ఒప్పుకుంది. సుఖేష్‌ నేర చరిత్ర గురించి తెలియకపోవడంతోనే ఆమె అతడితో సన్నిహితంగా ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. దీంతో ఆమెపై కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో జాక్వెలిన్‌కు భారీ ఊరట లభించినట్లైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button