కోలీవుడ్ లో ఆఫర్ కొట్టేసిన కోర్ట్ బ్యూటీ!

Sridevi: న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా మెప్పించారు. ఇప్పుడు శ్రీదేవి తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
‘కోర్ట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నాని నిర్మాణంలో రూపొందిన ఈ లీగల్ డ్రామాలో హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి యువ జంటగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఈ విజయంతో ఇద్దరూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు శ్రీదేవి తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ నటుడు, నిర్మాత కెజెఆర్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది.
మినిస్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి. తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రేగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.