కూలీ’ ట్రైలర్ డేట్ వచ్చేసింది!

Coolie: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ట్రైలర్ రిలీజ్ డేట్ గురించి తాజా అప్‌డేట్ ఇప్పుడు వచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న కూలీ సినిమా సౌత్ ఇండియన్ సినిమా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తోంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్ నటిస్తున్నారు.
ఆగస్ట్ 14న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ ట్రైలర్ ఆగస్ట్ 2న విడుదల కానుంది. గతంలో ట్రైలర్ లేకుండా సినిమా రిలీజ్ అవుతుందన్న రూమర్స్‌ను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఖండించారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఫస్ట్ లుక్, మ్యూజిక్ ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి.