సినిమా
కూలీ బాక్సాఫీస్ రికార్డ్!

Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్, నాగార్జున కాంబోలో వచ్చిన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి వీకెండ్‌లో రూ. 380 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం రికార్డులను తిరగరాసింది. కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం.
రజినీకాంత్, నాగార్జున కలయికలో రూపొందిన ‘కూలీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 380 కోట్ల వసూళ్లు రాబట్టి కోలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. విమర్శలతో సంబంధం లేకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది.
రిలీజ్‌కు ముందే బుకింగ్స్ భారీగా నమోదయ్యాయి. మొదటి రోజున రూ. 151 కోట్ల గ్రాస్ సాధించి తమిళ సినిమా రికార్డు నెలకొల్పింది. ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్ వంటి తారాగణం ఈ సినిమాకు బలం చేకూర్చింది. కూలీ హైప్ ఇంకా కొనసాగుతోంది.



