సినిమా

Kannappa: కన్నప్ప’ చిత్రం చుట్టూ కొత్త వివాదం: బ్రాహ్మణ సంఘాల ఆందోళన!

Kannappa: మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమాపై తాజాగా మరో వివాదం చెలరేగింది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల పోస్టర్‌పై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పాత్రలు తమ సంప్రదాయాలను కించపరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమాపై వివాదం తలెత్తింది. ఇటీవల విడుదలైన టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే, బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన ‘పిలక-గిలక’ పాత్రలు బ్రాహ్మణ సమాజాన్ని అవమానిస్తున్నాయని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ, మంచు కుటుంబం సనాతన ధర్మాన్ని అగౌరవపరుస్తోందని ఆరోపించారు. గతంలో ‘దేనికైనా రెడీ’ సినిమా వివాదంలో హైకోర్టు ఆదేశాలతో సన్నివేశాలు తొలగించిన సంగతిని గుర్తు చేశారు. ఈ పాత్రలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని మోహన్‌బాబు, విష్ణులను డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button