తెలంగాణ
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం

కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,658 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్లతో మొదలైన లెక్కింపులో ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ ముందంజలో నిలిచారు. మొత్తం 10 రౌండ్ల కౌంటింగ్లో 24 వేల పైచిలుకు ఓట్లతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు.



