తెలంగాణ

Chamala Kiran Kumar Reddy: పార్టీకి, ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు వారధిగా ఎంపీ చామల!

Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల కిరణ్ అనతికాలంలోనే మంచి ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపుపొందారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్తలకు అండగా, జాతీయ,రాష్ట్ర నాయకత్వానికి నమ్మిన బంటుగా, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కరడుగట్టిన కాంగ్రెస్ సైనికుడిగా అధిష్టానం ఇచ్చిన అవకాశంతో భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత తన పార్లమెంటు నియోజకవర్గపరిధిలో అనేక అభివృద్ధి , సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువవుతున్నారు.

ఇక ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయడంలో ఛామల రూటే సెపరేటు. కాంగ్రెస్ పార్టీని కాని, ప్రభుత్వాన్ని కానీ, సీఎం రేవంత్ ను ఎవ్వరు విమర్శించినా ధీటుగా జవాబిచ్చే సత్తా కలిగిన నాయకుడిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గుర్తింపుపొందారు. అటు ఢిల్లీ స్థాయిలోనూ నియోజకవర్గానికి సంబంధించిన నిధులు సాధించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తున్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండటంతోపాటు ఆయనపై ప్రతిపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇక ఇటీవల జరిగిన సర్పంచుల ఎన్నికల్లో తన నియోజకవర్గపరిధిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఎక్కువ మందిని గెలిపించుకునేలా కృషిచేశారు. దీంతో సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షునిగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

చామల కిరణ్ కుమార్ రెడ్డి యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2005 నుండి 2006 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 2007 నుండి 2008 వరకు రాహుల్ గాంధీ టీం అయిన డిస్కవరీ ఇండియా టాస్క్ ఫోర్స్ మెంబర్, ఆమ్ ఆద్మీకా సీపాహి నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 2008 నుండి 2009 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా, మహారాష్ట్ర, గోవా, డెహ్రాడూన్, హవేలీ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.

2009 నుండి 2011 వరకు జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పాండిచ్చేరి రాష్ట్రాల యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. 2017 నుండి 2021 వరకు టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసి 2021లో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా 18వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

ఇక ఆయన పార్లమెంటు సమావేశాలకు కూడా క్రమం తప్పకుండా హాజరవుతారు. వందశాతం హాజరు సాధించిన ఎంపీగా ఆయన గుర్తింపుపొందారు. ఇక తన నియోజకవర్గానికి సంబంధించి కాని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించికాని అభివృద్ధికి సంబంధించి కేంద్రాన్ని ప్రశ్నించడంలోనూ ఆయన ముందున్నారు. పార్లమెంటులో ఎక్కువశాతం ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button