తెలంగాణ

Talasani: తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు నిరసన సెగ

Talasani: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు నిరసన సెగ తగిలింది. సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభించేందుకు వచ్చిన తలసానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సొమ్మొకరిది సోకొకరిది అనే బ్యానర్లతో తలసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

డ్రైనేజీ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులిస్తే ఆ పనులకు తలసాని కొబ్బరికాయ కొట్టేందుకు రావడం సిగ్గుచేటన్నారు. సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కోట నీలిమ, మంత్రి పొన్నం సహకారంతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button