తెలంగాణ
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి

Medak: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతిపై కుటుంబసభ్యులు, ఆపార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన కారులో అనిల్ మృతదేహం లభ్యం కావడం.. అదేవిధంగా అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించడంలో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.
ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్‌లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత రోడ్డు ప్రమాదంగా పోలీసులు భావించారు. అయితే బుల్లెట్లు లభ్యం కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.